: కొన్నేళ్లుగా ఆ నటి అద్దం చూడకపోవటానికి కారణం అదే
మహిళలు రోజుకు ఎన్నిసార్లు అద్దం చూసుకుంటారు? వయసులో ఉన్నవారైతే లెక్క తేలదు. కాస్త వయసు పైబడ్డవారైతే కొన్నిసార్లు. మరి సినీ రంగంలో ఉన్న మహిళలైతే? ఆ లెక్క చెప్పడం కాస్త కష్టమే. కానీ అమెరికన్ సింగర్, యాక్టర్ షెర్ మాత్రం కొన్నేళ్లుగా అసలు అద్దం మొహమే చూడడం లేదట. తనకు వృద్ధాప్యం అంటే అసహ్యమని, అద్దం చూసుకుంటే తనకు వయసు పైబడినట్టు తెలుస్తుందని, అందుకే తాను అద్దం చూడనని తెలిపారు. తనకు ఆత్మవిశ్వాసం పాళ్లు తక్కువన్న ఆమె 40-45 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తాను చూడటానికి బాగానే ఉన్నానని, అయితే ఇప్పుడు 68 ఏళ్ల వయసు కావడంతో వయసు పైబడ్డ మగాళ్లు తనను ఇష్టపడుతున్నప్పటికీ, అద్దంలో చూసుకునేందుకు మొగ్గుచూపనని ఆమె తెలిపారు. తాను ప్రస్తుతానికి ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని ఆమె అంటోంది. నటన, సింగింగ్ మాననని, రిటైర్ అయ్యే ఆలోచన కూడా లేదని ఆమె చెప్పడం విశేషం.