: పూలన్ దేవి హత్య కేసులో దోషిగా షేర్ సింగ్ రానా


పదమూడేళ్ల నాటి సమాజ్ వాదీ పార్టీ ఎంపీ పూలన్ దేవి హత్య కేసులో షేర్ షింగ్ రానా అనే వ్యక్తిని ఢిల్లీలోని పాటియాలా కోర్టు దోషిగా నిర్ధారించింది. భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 302, సెక్షన్ 307 కింద రానాను దోషిగా నిర్ధారించినట్లు న్యాయస్థానం తెలిపింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో పదిమందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ నెల 12న రానాకు కోర్టు శిక్ష విధించనుంది. 2001 న్యూఢిల్లీలో పూలన్ దేవిని కాల్చి చంపిన రానా ఆ వెంటనే పోలీసుల ముందు లొంగిపోయాడు.

  • Loading...

More Telugu News