: తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల అవినీతిపై సీఐడీ కేసు
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల అవినీతిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ప్రాజెక్టు డైరెక్టర్లు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఏర్పాటు చేయగా, డీఎస్పీ నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేయనుంది. దర్యాప్తుకోసం 22 మంది సీఐడీ, 37 మంది ఇతర విభాగాల అధికారులను కేటాయించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సీఐడీ ఏర్పాటయ్యాక తొలి కేసు ఇదే.