: గాజా మళ్ళీ అంటుకుంది!
మూడు రోజుల కాల్పుల విరమణను కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం ఓవైపు నుంచి విజ్ఞప్తి చేస్తుండగానే... గాజా ప్రాంతంలో మళ్ళీ అగ్గిరాజుకుంది. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగించగా, ప్రతిగా ఇజ్రాయెల్ హమాస్ స్థావరాలపై భీకర దాడులు జరిపింది. కాల్పుల విరమణ ఈ ఉదయం ముగియగానే... 33కిపైగా రాకెట్లు తమ భూభాగంలోకి వచ్చి పడ్డాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. హమాస్ దాడుల విషయం తెలియగానే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, రక్షణ మంత్రి మోషే యాలోన్ తమ దళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీటుగా బదులివ్వాలని సూచించారు. దీంతో, ఫైటర్ జెట్లు ఒక్కసారిగా గాజావైపు దూసుకెళ్ళాయి. ఈ దాడిలో ఓ పదేళ్ళ బాలుడు మరణించినట్టు గాజా స్థానిక మీడియా పేర్కొంది.