: తానా ఆధ్వర్యంలో అమెరికాలో రేపటి నుంచి సీతారాముల కల్యాణోత్సవాలు


ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో రేపటి నుంచి (ఈ నెల 9) అమెరికాలో శ్రీసీతారాముల కల్యాణోత్సవాలను జరపాలని నిర్ణయించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారి సంక్షేమం కోసం ఈ ఉత్సవాలను జరుపుతున్నట్లు తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తెలిపారు. ఇందుకోసం అమెరికాలోని అన్ని నగరాల్లో ఏర్పాట్లు చేశామని చెప్పారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణం జరిపించే పండితులనే ఇక్కడకు పిలిపించి, వారితోనే కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపిస్తామని మోహన్ వివరించారు.

  • Loading...

More Telugu News