: మాసాయిపేట ఘటనపై సోషల్ మీడియాలో సంతాపాల వెల్లువ
ఈ ఉదయం మెదక్ జిల్లా మాసాయిపేటలోని కాపలా లేని రైల్వే గేటు వద్ద జరిగిన ఘోర ప్రమాదంపై సోషల్ మీడియాలో సంతాపాలు వెల్లువెత్తాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా సంతాప సందేశాలే. ఆ చిన్నారుల ఆత్మలకు శాంతి కలగాలని నెటిజన్లు సందేశాలు పొందుపరిచారు. కొవ్వొత్తులు, దీపాలతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు మరెన్నడూ జరగరాదంటూ వారు ఆకాంక్షించారు. కొందరైతే మరణవార్తను ఇతరులతో షేర్ చేసుకున్నారు.