: వరంగల్ లోని రాజరాజేశ్వరి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామునుంచే ఆలయాలకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. వరంగల్ లోని వేయిస్తంభాల ఆలయంలో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వరి, భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.