: దేశంలో టీవీ ఛానెల్స్ ఎలా ఉన్నాయో చూడండి: సీఎం రమేష్


దేశంలోని టీవీ ఛానెల్స్ ఎలాంటి వార్తలు, కార్యక్రమాలు ప్రసారం చేస్తాయో తెలంగాణ ప్రభుత్వం చూడాలని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ సలహా ఇచ్చారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీటీవీ 'తమాషా'ను చూస్తే మీడియా విమర్శలు ఏ రీతిలో ఉంటాయో తెలుస్తాయని అన్నారు. టీవీ9, ఏబీఎన్ ఛానెళ్లు మీడియా నియంత్రణ వ్యవస్థను దాటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తప్పు జరిగిందని, ఆ ఎపిసోడ్ ప్రసారం వల్ల ప్రజాప్రతినిధులు బాధపడ్డారని తెలిసిన తరువాత ఈ రెండు టీవీ ఛానెళ్లు జరిగిన తప్పిదాన్ని గుర్తించి, క్షమాపణలు కూడా చెప్పాయని అన్నారు. అలాంటప్పుడు ఎందుకు ఆ చానెళ్ల ప్రసారాలను ఆపాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. గతంలో రాజశేఖరరెడ్డి ఏ రీతిగా అయితే 'ఈనాడు', 'ఏబీఎన్'లపై కక్ష కట్టారో అదే రకంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రవర్తిస్తోందని సీఎం రమేష్ ఆరోపించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News