: మీడియాలో క్వాలిఫైడ్ ఎంతమందున్నారు?: సీపీఐ నేత రాజా
మీడియా సంస్థల్లో క్వాలిఫైడ్ జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారని సీపీఐ నేత డి.రాజా ప్రశ్నించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, మీడియా సంస్థలు ప్రభుత్వం చేసిన నిబంధనలు పాటించడం లేదని అన్నారు. ‘మీడియా సంస్థల్లో జీతాలు సరిగా చెల్లించరు. యాడ్స్ తీసుకురావాలనే నిబంధనలు విధిస్తారు. మీడియా సంస్థల్లో ప్రజాస్వామ్యం కాపాడలేని వారు ప్రజాస్వామ్యం కాపాడుతున్నామని చెబుతుంటారు... అదెలా సాధ్య’మని ఆయన ప్రశ్నించారు. ముందు మీడియా సంస్థల్లో వేతనాలు, నిబంధనలు సరిగా అమలవుతున్నాయా? అనేది పర్యవేక్షించాలని ఆయన సూచించారు.