: రూ.6 కోట్లతో టూరిజం కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తాం: ఏపీ డిప్యూటీ సీఎం
గోదావరి పుష్కరాల సందర్భంగా ఆరు కోట్ల రూపాయలతో టూరిజం కన్వెన్షన్ సెంటర్ ను నిర్మిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. గోదావరి పుష్కరాలపై ఇవాళ (శుక్రవారం) రాజమండ్రిలో మంత్రివర్గ ఉపసంఘం అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఆర్థిక మంత్రి యనమల మాట్లాడుతూ... త్వరలో గోదావరి పుష్కరాల తేదీలను ఖరారు చేస్తామని అన్నారు. పార్కింగ్ సమస్యపై ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో చర్చించామని ఆయన చెప్పారు.