: మీడియా లేకపోతే ప్రభుత్వానికి ఏదీ తెలియదు: నరేష్ అగర్వాల్
మీడియాపై ఎంఎస్ఓలు ఆంక్షలు విధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ ప్రశ్నించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఎంఎస్ఓలు నియంతల్లా వ్యవహరిస్తుంటే చేతలుడిగి ఎలా కూర్చున్నారని ప్రశ్నించారు. మీడియా లేకుండా పోతే ‘రాజూభయ్యా రౌడీ అని ప్రపంచానికి తెలిసేదా? అత్యాచారాలు తెలిసేవా? ప్రభుత్వాలు చేసే తప్పులు, పధకాలు ప్రజలకు తెలిసేవా?’ అని ఆయన ప్రశ్నించారు. మీడియాకు స్వేచ్ఛ ఉంది. వారి విజ్ఞతకే రాతలను వదిలేయాలని ఆయన సూచించారు. అయితే మీడియా ప్రకటనలపై ఆధారపడడం సరికాదని, అలాంటి వాటిపై చర్యలు తీసుకోవడం మానేసి వార్తలు వ్యతిరేకంగా రాశారని చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. తక్షణం ఎంఎస్ఓలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.