: నిరసనకారులు ఇంకు చల్లడంతో మంత్రి కంటికి తీవ్ర గాయం


మహరాష్ట్రలో కొందరు నిరసనకారుల చర్య మంత్రి కంటికి తీవ్ర గాయం చేసింది. తమను షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) జాబితాలో చేర్చాలంటూ ధంగర్ వర్గం పుణే జిల్లాలోని భిగ్వాన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. ఆ సమయంలో అక్కడ మహారాష్ట్ర సహకార శాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ ఉండడంతో ఆయనపై నిరసనకారులు ఇంకు చల్లారు. ఈ ఘటనలో ఆయన కంటికి గాయమైంది. ప్రస్తుతం పాటిల్ పుణేలోని రూబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కన్ను విపరీతంగా నొప్పి వేస్తోందని, వారు చల్లిన ఇంకులో రసాయన పదార్థం ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఇంకు పాటిల్ చొక్కాపై పడగా, దానికి రంధ్రాలు పడడం గమనార్హం.

  • Loading...

More Telugu News