: ఢిల్లీలో రాజ్ నాథ్ సింగ్ ను కలసిన అశోక్ బాబు


కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఢిల్లీలో ఈరోజు (శుక్రవారం) కలిశారు. ఏపీఎన్జీవోల స్థల వివాదాన్ని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇళ్లు కట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీవోలకు స్థలాన్ని కేటాయించింది. కానీ, ఇంతవరకు అందులో నిర్మాణాలు చేబట్టకపోవడంతో ఖాళీగా ఉంది. అటు ఈ భూమిపై ఇప్పటికే హైకోర్టులో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం వారి భూమిని స్వాధీనం చేసుకున్న విషయం, తర్వాత హైకోర్టు యథాతథస్థితిని ఆదేశించిన విషయం తెలిసిందే!

  • Loading...

More Telugu News