: ఆ స్కూలు బస్సు నడిపింది ట్రాక్టర్ డ్రైవరట..!
నేడు తెలంగాణలో విషాదానికి కారణమైన ఘటనలో మరో కీలక అంశం వెలుగుచూసింది. కాకతీయ విద్యామందిర్ స్కూలు బస్సును ప్రమాద సమయంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ నడిపినట్టు తెలుస్తోంది. రెగ్యులర్ డ్రైవర్ రాకపోవడంతో స్కూలు యాజమాన్యం భిక్షపతి అనే ట్రాక్టర్ డ్రైవర్ కు బస్సు అప్పగించినట్టు సమాచారం. ఆ సమయంలో రైలు రాదన్న నమ్మకంతోనే అతడు బస్సును పట్టాలు దాటించే యత్నం చేయగా, అదే సమయంలో వచ్చిన నాందేడ్ ప్యాసింజర్ ఢీకొట్టింది.