: ప్రసారాల నిలిపివేత హక్కును ఎంఎస్ఓలకు ఎవరిచ్చారు?: బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్
మీడియా సంస్థలు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు గానీ... వాటిని మొత్తం బంద్ చేయడం తగదని బీజేపీ ఉత్తరాఖండ్ ఎంపీ తరుణ్ విజయ్ అభిప్రాయపడ్డారు. ఎంఎస్ఓలకు ప్రసారాలు నిలిపివేసే హక్కును ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. మీడియాను కంట్రోల్ చేసే ప్రయత్నాలు దేశంలో జరుగుతున్నాయన్నారు. ఎంఎస్ఓల విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గాంధీ, రాంమనోహర్ లోహియా, వాజ్ పేయి లాంటి గొప్పనాయకులు పాత్రికేయ రంగం ద్వారా సామాజిక చైతన్యం తీసుకువచ్చారని తరుణ్ విజయ్ పేర్కొన్నారు. గతంలో పత్రికలను చదివి భాష నేర్చుకునేవారని... ఇప్పుడా పరిస్థితి లేదని ఆయన అన్నారు.