: సైఫ్ 'పద్మ' అవార్డును వెనక్కు తీసుకునే ఆలోచన లేదు: కేంద్ర సర్కార్


బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకునే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ మేరకు ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ, ఎస్ సి అగర్వాల్ అనే ఆర్ టీఐ కార్యకర్త సొంత ఫిర్యాదు మేరకు హోంమంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై పరిశీలిస్తున్నామని, ఎదైనా పెండింగ్ ఫిర్యాదులుంటే సమాధానం ఇవ్వడం సాధారణమేనని పేర్కొన్నారు. కాగా, ఏదైనా అవార్డును వెనక్కి తీసుకోవాలంటే ఫిర్యాదులో ఆరోపణలను ధ్రువీకరించుకునేందుకు సదరు రాష్ట్రాలు లేదా కోర్టుల నుంచి అవసరమైన రికార్డులను హోంమంత్రిత్వ శాఖ అడిగి తీసుకుంటుందని చెప్పారు. ఈ క్రమంలో కొంత సమయం పడుతుందని, ఫిర్యాదులోని ఆరోపణలను రికార్డులతో సరిచూసుకుని నిర్ణయిస్తుందన్నారు. అంతవరకు ఇలాంటి అంశాలు పరీశీలనలోనే ఉంటాయన్నారు. ఒక వ్యక్తికి పద్మ అవార్డు ప్రకటించే ముందు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా చెక్ చేస్తామని, అంతేకాక పలువురు సభ్యుల కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుందని అదే సైఫ్ విషయంలోనూ చేశామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News