: గోదావరి పుష్కరాలపై కేబినెట్ సబ్ కమిటీ: ఆర్థిక మంత్రి యనమల
2015 జులైలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గతంలో రూ.100 కోట్లతో పుష్కరాలను నిర్వహించారని ఈ ఏడాది పుష్కరాలకు రూ.500 కోట్లు సమకూర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై అధికారులతో పుష్కరాలపై చర్చించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన యనమల, పుష్కరాల నిధులకోసం కేంద్రానికి సీఎం లేఖ రాస్తారని, పుష్కరాల్లో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పుష్కర ఘాట్ లు ఎక్కడెక్కడ నిర్మించాలనే దానిపై చర్చించామని మంత్రి చెప్పారు.