: మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా


మాసాయిపేట ఘటనలో మృతుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వారంరోజుల్లోగా రైల్వే గేటు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, గాయపడిన చిన్నారుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పరామర్శించారు.

  • Loading...

More Telugu News