: మాసాయిపేట ప్రమాదంపై మోడీ విచారం


మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఈ ఉదయం చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీ జరుగుతున్న సమయంలో ఆయనకు ఈ ప్రమాద వార్త తెలిసింది. ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాల్సిందిగా మోడీ రైల్వే శాఖ మంత్రి సదానందగౌడను ఆదేశించారు. కాగా, రైల్వే మంత్రి నేటి ప్రమాదఘటనపై ఈ మధ్యాహ్నం మూడు గంటలకు పార్లమెంటులో ప్రకటన చేయనున్నారు.

  • Loading...

More Telugu News