: ఎంసెట్ కౌన్సెలింగ్ లో తీవ్ర గందరగోళం... అయోమయంలో విద్యార్థులు
ఎంసెట్ కౌన్సెలింగ్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌన్సెలింగ్ ను ప్రారంభించింది. అయితే, కౌన్సెలింగ్ కు మరో తేదీని ప్రకటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇంతకు ముందు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధం కాదని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో, ఇరు రాష్ట్రాల విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. కౌన్సెలింగ్ ప్రారంభం అయినా విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. నిన్నటి కౌన్సెలింగ్ కు 5 వేల మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా... కేవలం 780 మంది మాత్రమే హాజరయ్యారు.