: రెండు వికెట్లు తీసిన టీమిండియా...ఇంగ్లండ్ 40/2
ప్రతిష్ఠాత్మక ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో టీమిండియా బౌలర్లు సత్తా చాటుతున్నారు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మన్ పేలవ ప్రదర్శనతో 152 పరుగులకే భారత జట్టు పరిమితమైంది. దీంతో, ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. భారత టాప్ ఆర్డర్ చేతులెత్తేసిన చోట ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జాగ్రత్తగా ఆచితూచి ఆటను ప్రారంభించారు. పిచ్ పేసర్లకు సహకరిస్తుండడంతో భువీ అద్భుతమైన బంతితో రాబ్సన్ ను పెవిలియన్ బాట పట్టించాడు. వరుణ్ ఆరోన్ కుక్ ను అవుట్ చేయడంతో 15 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది.