: ఇంటి కోసం ప్రియాంక చోప్రా వంద కోట్లు ఖర్చు పెట్టిందా?


బాలీవుడ్ నటి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇంటి కోసం వంద కోట్లు ఖర్చు పెట్టిందని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ముంబైలోని లోఖండ్ వాలాలో ఇప్పటికే సొంత ఇల్లు కలిగి వున్న ప్రియాంక చోప్రా, వెర్సోవాలోని బీచ్ ఒడ్డున ఉన్న 'దరియా మహల్'పై మనసు పారేసుకుంది. దీంతో ఆ బంగ్లాను సొంతం చేసుకుందని వినికిడి. గతంలో ఎన్నో సినిమాల్లో కనువిందు చేసిన 'దరియా మహల్'ను 1930లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ క్లాడ్ బాట్లే ప్రముఖ వస్త్ర వ్యాపారి మనేక్లాలా చునిలాల్ చినాయ్ కోసం డిజైన్ చేశారు. ఈ ఇంటిలో సుమారు 15 బెడ్ రూంలు ఉన్నాయని ఓ వెబ్ సైట్ కథనంలో పేర్కొంది. పురాతన బంగ్లాకు శోభ చేకూర్చేందుకు పురాతన వస్తువులు వినియోగించారని అందులో వెల్లడించారు. వీటన్నింటినీ చూసిన ప్రియాంక చోప్రా దీనిని వంద కోట్లకు కొనుగోలు చేసిందని బాలీవుడ్ టాక్.

  • Loading...

More Telugu News