: మాంచెస్టర్ టెస్ట్ లో చేతులెత్తేసిన భారత్ బ్యాట్ మెన్
మాంచెస్టర్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత్ బ్యాట్ మెన్ పేలవ ప్రదర్శన చేశారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. ఫలితంగా, తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకే భారత్ ఆలౌట్ అయ్యింది. ధోనీ 71 పరుగులు చేయగా, అశ్విన్ 40 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. రహానే 24 పరుగులు చేయగా, గంభీర్ 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టడం భారత అభిమానులను నిరాశపరిచింది. మురళీ విజయ్, పూజారా, కోహ్లి, జడేజా, భువనేశ్వర్, పంకజ్ సింగ్ డకౌట్ అయ్యారు. బ్రాడ్ 6 వికెట్లు, అండర్సన్ 3 వికెట్లు తీశారు.