: వికెట్ల పతనం ఆగినట్టేనా..?
ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో ఆదిలోనే తగిలిన ఎదురుదెబ్బ నుంచి టీమిండియా కాసింత తేరుకుంది. కొద్దిసేపటి క్రితమే ఆరంభమైన ఈ మ్యాచ్ లో 8 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోగా, కెప్టెన్ ధోనీ (9*), రహానే(7*) పోరాడుతున్నారు. ప్రస్తుతం భారత్ 24/4 స్కోరుతో ఆడుతోంది. కాగా, అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇంగ్లండ్ పేసర్లు బ్రాడ్, ఆండర్సన్ ధాటికి విలవిల్లాడింది. పిచ్ అనుకూలించడంతో వీరిద్దరి బౌలింగ్ కు భారత టాపార్డర్ వద్ద జవాబే లేకపోయింది. చెరో రెండు వికెట్లతో ఈ జోడీ ధోనీ సేనను దెబ్బకొట్టింది.