: కష్టాల్లో భారత్... 8 పరుగులకే 4 వికెట్లు!
నాలుగో టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లో 8 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. జోరు మీదున్న ఇంగ్లండ్ బౌలర్లు తొలుత టీమిండియా ఓపెనర్లను తిప్పిపంపారు. మొదట గంభీర్ (4) ను బ్రాడ్ పెవిలియన్ చేర్చగా, మరో ఓపెనర్ విజయ్ ఖాతా తెరవకుండానే ఆండర్సన్ బంతికి బలయ్యాడు. చాన్నాళ్ళ తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన గంభీర్ కు ఈ ఇన్నింగ్స్ ఓ చేదు జ్ఞాపకమే. ఇక, వారిస్థానాల్లో బ్యాటింగ్ కు దిగిన పుజారా (0), కోహ్లీ (0) పరుగులేమీ చేయకుండా వెనుదిరిగారు. పుజారాను ఆండర్సన్, కోహ్లీని బ్రాడ్ అవుట్ చేశారు.