: జయలలిత సంచలన నిర్ణయం: ఆన్ లైన్ లోనే పారిశ్రామిక లైసెన్సులు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు పరిశ్రమల లైసెన్సింగ్ విధానాన్ని అత్యంత సులభతరం చేసే నిర్ణయాన్ని ఆమె తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం తమిళనాడులో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి ఇకపై ఆన్ లైన్ లోనే లైసెన్సులు మంజూరు చేయనున్నారు. దీని వల్ల పారిశ్రామికవేత్తలు కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పుతుంది. పారిశ్రామికవేత్తలకు లైసెన్సుల మంజూరు గురించి త్వరలో ఓ వెబ్ పోర్టల్ ను పెడుతున్నామని జయలలిత అసెంబ్లీలో తెలిపారు.