: సినీ సిటీకి సీఎం కేసీఆర్ పేరు పెట్టాలి: నటుడు కృష్ణ


తెలంగాణలో రెండువేల ఎకరాలతో కొత్తగా నిర్మించబోయే సినీ సిటీకి ప్రముఖ నటుడు కృష్ణ మద్దతు పలికారు. సినీ సిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెట్టాలని అన్నారు. ఇందుకు కేసీఆర్ ను ప్రశంసించిన ఆయన, సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అభినందించాలన్నారు. హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఈరోజు (గురువారం) సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ తొలి చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే తరాలు కూడా కేసీఆర్ ను గుర్తు పెట్టుకుంటాయన్నారు. సినీ సిటీ నిర్మాణంతో హాలీవుడ్ సినిమాలకు హైదరాబాద్ కేంద్రం అవుతుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News