: పలువురి పరిస్థితి విషమంగా ఉంది: యశోదా ఆసుపత్రి
మెదక్ జిల్లాలో జరిగిన స్కూలు బస్సు ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సికింద్రాబాదులోని యశోదా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, 24 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్టు యశోదా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించాయి.