: ఉస్మానియా వర్శిటీలో నిరసన జ్వాలలు ఇంకా చల్లారలేదు
హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒప్పంద ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్డ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు (గురువారం) ఆర్ట్స్ కాలేజ్ నుంచి ‘చలో తార్నాక’ కార్యక్రమం చేపట్టారు. పోలీసులు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి వద్ద విద్యార్థులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చే్స్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.