: సెలబ్రిటీల కోసం ఫేస్ బుక్ 'మెన్షన్ యాప్' వచ్చేసింది


కేవలం సెలబ్రిటీల కోసం ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ రూపొందించిన 'మెన్షన్ యాప్' వచ్చేసింది. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 40 ఇతర దేశాల్లోనూ ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఫేస్ బుక్ గుర్తించిన లేదా నిర్ధారించిన సెలబ్రిటీల ఖాతాల కోసమే ఈ యాప్ డిజైన్ చేశారు. అంటే నటులు, క్రీడాకారులు, మ్యుజీషియన్స్, ఇతర ప్రముఖులకు మాత్రమే యాప్ సౌకర్యం ఉంటుందన్నమాట. దీని ద్వారా తమ ఖాతాలను వారు తేలికగా నిర్వహించుకోవడానికి 'మెన్షన్ యాప్' సహాయపడుతుంది. అంతేకాక అభిమానులు, ఇతరులతోనూ చాలా తేలికగా చాటింగ్ చేసుకోవడం, పలు విషయాలను పోస్టు చేయడం వంటి మరెన్నింటినో ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News