: బస్సు ప్రమాదంపై పార్లమెంటులో చర్చ... 3 గంటలకు ప్రకటన
మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొన్న ఘటనపై పార్లమెంటులో చర్చ జరిగింది. లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో, ప్రమాద ఘటనను ఎంపీ జితేందర్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఘటనపై స్పందించాలని కోరారు. దీనిపై రైల్వే మంత్రి సదానందగౌడ మాట్లాడుతూ, జరిగిన ఘటన అత్యంత బాధాకరమైనదని అన్నారు. సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంపై మధ్యాహ్నం 3 గంటలకు లోక్ సభలో సదానందగౌడ ప్రకటన చేయనున్నారు.