: సుబేదార్ పతన్ వ్యవహారంపై ఆర్మీ స్పందన
భారత సైన్యానికి చెందిన రహస్యాలు, కొన్ని పత్రాలు, చిత్రపటాలను పాకిస్థాన్ కు చెందిన యువతికి ఈ-మెయిల్ ద్వారా పంపిన సుబేదార్ పతన్ కుమార్ ను హైదరాబాద్ సెంట్రల్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా ఆర్మీ స్పందిస్తూ, ఈఎంఈ యూనిట్ తో పతన్ కు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. సికింద్రాబాద్ ఈఎంఈ యూనిట్ సమాచారం అంతా భద్రంగా ఉందని, సమాచారమేదీ బయటకు పొక్కలేదని ఆర్మీ స్పష్టం చేసింది.