: విద్యుత్ రంగంలో తొలిసారి సంస్కరణలు నేనే తీసుకువచ్చా: చంద్రబాబు
విద్యుత్ రంగంలో తొలిసారిగా సంస్కరణలు తీసుకువచ్చింది తానేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను అప్పుడు సంస్కరణలు చేపడితే అందరూ విమర్శించారని ఆయన అన్నారు. అయితే, తాను చేపట్టిన సంస్కరణల మూలంగా 2004 కల్లా దేశంలో మిగులు విద్యుత్ ఉన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అప్పట్లో నిలిచిందని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ హయాంలోని పదేళ్లలో విద్యుత్ రంగ పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన అన్నారు.