: శ్రీశైలం డ్యాంను ముట్టడిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలు, రైతులు
శ్రీశైలం డ్యాం నుంచి డెల్టాకు నీటి తరలింపును నిలిపివేయాలని కర్నూలు జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. డెల్టాకు నీటి విడుదల వల్ల సీమ ప్రయోజనాలు దెబ్బతింటాయని వారు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ ఉత్పాదన పేరుతో శ్రీశైలం జలాలను అక్రమంగా దిగువకు విడుదల చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా రైతులు ఈ రోజు శ్రీశైలం డ్యాంను ముట్టడిస్తున్నారు.