: చంద్రబాబు ఫొటోకు పూజలు చేసిన డ్వాక్రా మహిళలు, రైతులు
అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలోని డ్వాక్రా మహిళలు, రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దేవుడిలా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఫొటోతో పాటు ఎన్టీఆర్ ఫొటోను కూడా పొలంలో పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజాదికాలు నిర్వహించారు. తద్వారా ఆయనపై తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు నిజంగా దేవుడన్నారు. కష్టాల్లో ఉన్న తమను రుణమాఫీ ద్వారా ఆదుకున్నారని తెలిపారు.