: సినీ రంగం విడిపోయినా... అభివృద్ధి కోసం కలిసే ఉంటుంది: హరీష్ రావు
తెలుగు సినిమా రంగం సంఘాలుగా విడిపోయినా... అభివృద్ధి కోసం కలిసే ఉంటుందని ఆశిస్తున్నట్టు టీఎస్ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని ఇందిరానగర్లో 'తెలంగాణ స్టేట్ సినిమా డ్యాన్సర్స్ అండ్ డాన్స్ అసోసియేషన్' లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల నిర్మాణం కోసం సినిమా సిటీని ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పారు. సినీ రంగంలో తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అవకాశం కలిగేలా చూస్తామని చెప్పారు.