: పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాంతాలకు 16 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఔరంగాబాద్ - తిరుపతి, సికింద్రాబాదు - విజయవాడ, సికింద్రాబాదు - విశాఖ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఆగస్టు 15, 22, 29 తేదీల్లో ఔరంగాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఆగస్టు 16, 23, 30 తేదీల్లో తిరుపతి నుంచి ఔరంగాబాదుకు ప్రత్యేక రైళ్లు బయల్దేరతాయి. ఆగస్టు 15, 22, 29 తేదీల్లో సికింద్రాబాదు - విజయవాడ, 14, 21, 28 తేదీల్లో విజయవాడ నుంచి సికింద్రాబాదుకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ నెల 22, 29 తేదీల్లో సికింద్రాబాదు - విశాఖ, 23, 30 తేదీల్లో విశాఖ - సికింద్రాబాదు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.