: లాంగ్ డ్రైవ్ కెళ్లి దోపిడీకి గురైన నటి


యువత లేటెస్ట్ క్రేజ్ లాంగ్ డ్రైవ్... యువత హాబీల్లో లాంగ్ డ్రైవ్ ఉండి తీరుతోంది. అలా లాంగ్ డ్రైవ్ కెళ్లిన బాలీవుడ్ వర్థమాన నటి దోపిడీకి గురైంది. రెండు మూడు బాలీవుడ్ సినిమాల్లో నటించిన శ్రీజిత తన సమీప బంధువుతో కలిసి వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవేపై లాంగ్ డ్రైవ్ కు వెళ్లింది. ముంబైకి దగ్గర్లోని ఓ దాభాలో డిన్నర్ చేసి, ఆలస్యంగా బయల్దేరడాన్ని అలుసుగా తీసుకున్న స్థానిక గూండాలు, ఆమెపై దౌర్జన్యానికి దిగారు. మొబైల్ ఫోన్, ఇతర వస్తువులు దోచుకుని వెళ్లిపోయారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

  • Loading...

More Telugu News