: 'కేజీ టు పీజీ' ఉచిత విద్యకు టాటాల సహకారం: కేసీఆర్
'కేజీ నుంచి పీజీ' వరకు ఉచిత విద్యకు టాటా గ్రూప్ సహకారం అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీతో సమావేశమయిన అనంతరం ఆయన మాట్లాడుతూ... పరిశ్రమలు, ఐటీ, విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో టాటాల సహకారం తీసుకుంటామని అన్నారు. మురికివాడలు లేని నగరంగా హైదరాబాదుని తీర్చిద్దేందుకు అవసరమైన సహకారం అందిస్తామని మిస్త్రీ తెలిపారు. టాటా సంస్థల అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.