: పది పాసవ్వకపోయినా... చొక్కాతో రికార్డు పుటలకెక్కాడు


విద్యకు, సంపాదనకు సంబంధం లేదని మహారాష్ట్రకు చెందిన పంకజ్ పరాఖ్ నిరూపించాడు. ఏదయినా రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే నైపుణ్యం కావాలని మేధావులు చెప్పినట్టు... పదోతరగతి కూడా పాసవ్వని పంకజ్ దుస్తుల వ్యాపారాన్ని నమ్ముకున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పంకజ్ పరాఖ్ ను అందరూ ‘బంగారు బాబు’ అని పిలుచుకునే స్థాయికి చేరుకున్నాడు. పంకజ్ పరాఖ్ నాలుగు కిలోల బరువున్న చొక్కాతో పాటు మూడు కేజీల బంగారు నగలు వేసుకుని మహారాష్ట్రలోని యోలా నగరంలో చక్కర్లు కొడతాడు. చొక్కా నాలుగు కేజీలు ఏంటా అనుకుంటున్నారా? అవును మరి... అది బంగారంతో చేసిన చొక్కా. దాని ధర అక్షరాలా కోటీ 30 లక్షల రూపాయలు! గత శుక్రవారం వీఐపీల మధ్య తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు పంకజ్. ఏడు బంగారు గుండీలున్న ఈ చొక్కా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News