: ఒక్క మెడల్ తో ఆ షూటర్ జీవితం మారిపోయింది!


ఒక్క మెడల్ తో ఆ షూటర్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటివరకు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు... కానీ, కామన్వెల్త్ క్రీడల్లో 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణపతకం సాధించిన తర్వాత రాహి సర్నోబత్ పేరు మార్మోగిపోయింది. గన్నును టార్గెట్ పాయింట్ కి గురి పెట్టిన రాహి సర్నోబత్... ఆ క్షణంలో ఇంతటి క్రేజ్ వస్తుందని ఊహించి ఉండదు. బంగారు పతకాన్ని గెల్చుకోవడంతో భారత్ లో ఆమెకు ఘనస్వాగతం లభించింది. స్వర్ణ పతకాన్ని సాధించినందుకు గాను రాహి సర్నోబత్ కు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ఓ వైపు సన్మానాలు, మరో వైపు నజరానా... ఆనందంతో మునిగితేలుతున్న ఆమెకు ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాహి సర్నోబత్ ను డిప్యూటీ కలెక్టరుగా నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క మెడల్ తో రాహి సర్నోబత్ ఇప్పుడు బుల్లెట్ లా దూసుకుపోతోంది.

  • Loading...

More Telugu News