: గోల్కొండ కోటలో ఆగస్టు 15 వేడుకలా?: కిషన్ రెడ్డి


ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిలదీశారు. అసలు కోటలో వేడుకలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటో ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన, నియంతలు పాలించిన కోటలో జాతీయ వేడుకలు ఏ రకంగా జరపాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మాత్రమే గోల్కొండ కోటలో నిర్వహించాలని కిషన్ రెడ్డి చెప్పారు. ఇది ఆషామాషీ వ్యవహారమో, కేసీఆర్ సొంతింటి వ్యవహారమో కాదని జాతీయ జెండా పండుగని కిషన్ అన్నారు. నిజాం పాలనకు అంతం పలికిన రోజు సెప్టెంబర్ 17వ తేదీ అని, ఆ రోజునే గోల్కొండలో జెండా ఎగురవేయాలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News