: సచిన్, రేఖలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మండిపాటు
క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి రేఖలపై ఐపీఎల్ మాజీ చీఫ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులైన వారిద్దరూ సమావేశాలకు హాజరుకాకపోవడంపై మండిపడ్డారు. ఈ మేరకు ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడిన శుక్లా, సమావేశాలకు రాలేనివారు పార్లమెంటు సభ్యుత్వాన్ని ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. అయితే, గతవారంలో ఈ విషయంపై తాను సచిన్ తో మాట్లాడానని, తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే ఏడాది సమావేశాలకు కూడా తప్పకుండా వస్తానని సచిన్ చెప్పినట్లు వెల్లడించారు. ఇదిలావుంటే, పలు బయటి కార్యక్రమాలకు వెళుతున్న రేఖ, సచిన్ ల ఈ ఏడాది సమావేశాల హాజరు కేవలం ఐదుశాతమే ఉందట.