: విశాఖను తెలుగు సినీపరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దుతా: చంద్రబాబు
విశాఖను తెలుగు సినీపరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో సినీపరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తామని ఆయన అన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులతో పాటు తెలుగు, తమిళం, మలయాళ మరియు కన్నడ పరిశ్రమకు చెందిన అగ్రనిర్మాతలు నిన్న చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు. విశాలమైన సాగరతీరంతో పాటు... ప్రకృతి రమణీయతకు నెలవైన విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే, అరకును తమిళనాడులోని ఊటీకి దీటుగా తీర్చిదిద్ది... అద్భుతమైన లొకేషన్లకు సినీపరిశ్రమకు అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.