: లోక్ సభ వెల్ లో రాహుల్ నిరసన... స్పీకర్ పై ఆరోపణలు
దేశంలో మత ఘర్షణలు నానాటికీ పెరుగుతున్నాయని... దీనిపై లోక్ సభలో చర్చ కోసం తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్... చర్చ జరపాలంటూ తీవ్రంగా పట్టుబట్టింది. ఇందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో పలువురు పార్టీ నేతలతో కలసి రాహుల్ గాంధీ స్పీకర్ వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చ చేపట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. "కేవలం సభలో ఒక వ్యక్తి గొంతే (ప్రభుత్వం) వింటున్నారు. కానీ, మా అభిప్రాయాలు వినడంలేదు. మత ఘర్షణలపై మేము చర్చ జరపాలని కోరుతున్నాం. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. దీన్ని మేం సహించలేం. అలా ఒక్కరి అభిప్రాయాలే పట్టించుకోవడం ఎంతమాత్రం సరికాదు" అని రాహుల్ విమర్శలు చేశారు. అనంతరం సభను స్పీకర్ వాయిదా వేశారు.