: గ్లాస్గోలో అరెస్టయిన భారత క్రీడాధికారులు విడుదలయ్యారు
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల సమయంలో అరెస్టయిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సెక్రెటరీ జనరల్ రాజీవ్ మెహతా, రెజ్లింగ్ రెఫరీ వీరేంద్ర మాలిక్ లు విడుదలయ్యారు. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిద్దరిపై మోపిన అభియోగాలను కొట్టివేసి పోలీసులు విడిచిపెట్టారు. దాంతో, ఈ వ్యవహారం అక్కడి షరీఫ్ కోర్టులో విచారణకు రాలేదని భారత హైకమిషన్ అధికారి ఒకరు తెలిపారు. అటు ఇద్దరినీ నిర్దోషులుగా విడిచి పెట్టడంతో భారత ప్రతినిధి బృందం ఊపిరి పీల్చుకుంది. మద్యం మత్తులో వాహనం నడిపారన్న కారణంగా మెహతాను, లైంగిక వేధింపుల ఆరోపణలపై మాలిక్ ను నాలుగు రోజుల కిందట స్కాట్ లాండ్ పోలీసులు అరెస్టు చేశారు.