: ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి: హోంమంత్రి చినరాజప్ప


ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతుందంటూ వస్తున్న వార్తలపై హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు. నూతన జిల్లా ఏర్పాటుకు ముందుగా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబసభ్యులతో కలసి ఆయన పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అర్హులైన ఖైదీలను అక్టోబర్ 2న విడుదల చేస్తామని చెప్పారు. వ్యవసాయ మార్కెట్, దేవాదాయ కమిటీల రద్దుకు రెండు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడుతాయన్నారు. ఎంసెట్, బోధనా రుసుములపై టీఎస్ సీఎం కేసీఆర్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఉమ్మడి పోలీస్ వ్యవస్థ ఉండాలన్న హోంమంత్రి... దీనిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే గవర్నర్ ను కోరినట్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News