: విమానాన్ని కిందికి దించిన అనుకోని అతిథులు!


అనుకోని అతిథుల కారణంగా ఎయిరిండియా విమానం ఒకటి అత్యవసరంగా కిందికి దిగాల్సివచ్చింది. విమానంలోపల ఎలుకలు స్వైర విహారం చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది బెంబేలెత్తిపోయారు. దీంతో ఆ విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దించేశారు. అనంతరం ఆ విమానాన్ని హ్యాంగర్ కు తరలించి ఎలుకలను పారద్రోలేందుకు ఫ్యూమిగేషన్ (పొగవేయడం) కార్యక్రమం ప్రారంభించారు. సోమవారం జరిగిందీ ఘటన. విమానయాన నియమావళిని అనుసరించి... ప్లేన్ లో ఒక్క ఎలుక కనిపించినా సరే ఫ్యూమిగేషన్ తప్పనిసరి. అవి ఎలక్ట్రిక్ వైర్లను కొరికితే జరిగే అనర్థం దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటారు. ఈ మూషికాలు ఎక్కువగా క్యాటరింగ్ వ్యాన్ల ద్వారానే విమానాల్లోకి ప్రవేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది అన్ని చోట్లా ఉండేదేనని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News