: ఇషాంత్ శర్మ దశ తిరిగింది


లార్డ్స్ టెస్టులో భారత్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన భారత ఫాస్ట్‌ బౌలర్ ఇషాంత్‌శర్మ దశ తిరిగింది. లార్ట్స్ టెస్ట్ లో ఇషాంత్ బౌలింగ్ పర్ఫామెన్స్ కు ఇంప్రెస్ అయిన కార్నర్‌స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇక నుంచి ఇషాంత్‌కు సంబంధించిన బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఇతర వాణిజ్య ఒప్పందాల కార్నర్‌స్టోన్ సంస్థ చూడనుంది. క్రికెటర్లకు కార్పొరేట్ ఎండార్స్ మెంట్స్ తీసుకురావడం ద్వారా వారికి భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చడంలో కార్నర్‌స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు మంచి పేరు ఉంది. టీమిండియా క్రికెటర్లు కోహ్లి, ధావన్, రోహిత్ శర్మలతో పాటు... అండర్ 19 సంచలనాలు విజయ్ జోల్, స్మిత్ పటేల్ వ్యవహారాలను కూడా కార్నర్ స్టోన్ సంస్థే చూస్తోంది. టాప్ క్రీడాకారుల వ్యవహారాలు చూసుకునే కార్నర్ స్టోన్ సంస్థతో ఒప్పందం కుదరడం పట్ల ఇషాంత్ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు. ఇది తనకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నాని అన్నాడు.

  • Loading...

More Telugu News