: సచిన్ రాకతో సింధుకు టెన్షన్ తప్పదా..!


కామన్వెల్త్ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పూసర్ల వెంకటసింధు కూడా పాల్గొంటోంది. అయితే, ఆమె భారత అభిమానుల ఆశలనే కాదు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంచనాలనూ అందుకోవాల్సి ఉంటుందండోయ్. ఎలాగంటారా... 2012లో సింధు జూనియర్ ఏషియన్ చాంపియన్ షిప్ నెగ్గి ఆ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించింది. ఆ ఘనతను అభినందిస్తూ సచిన్ ఆమెకో కారు బహూకరించాడు. భవిష్యత్తులో ఇలాంటివే మరిన్ని విజయాలు అందుకోవాలని సచిన్ ఆ సందర్భంగా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల సందర్భంగా సచిన్ బ్రిటన్లోనే ఉన్నాడు. ముఖ్యంగా ఈ బ్యాటింగ్ దేవుడు సింధు ఆడే మ్యాచ్ లపై ఆసక్తి కనబరుస్తుండడం ఆమెను ఒత్తిడిలోకి నెడుతుందని క్రీడా పండితులంటున్నారు. అంతటి క్రికెట్ దిగ్గజం తన మ్యాచ్ లను వీక్షించనుండడం సింధును టెన్షన్ కు గురిచేసే అంశమే. మరి, ఈ ఒత్తిడిని తెలుగుతేజం ఎలా అధిగమిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News